Kalvakuntla Kavitha : వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : కవిత
వచ్చే 2029 ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు
వచ్చే 2029 ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తానని, ఏ ఎన్నికల్లో బరిలోకి దిగుతానన్న విషయంపై కవిత క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ తాను రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా బరిలోకి దిగుతానని చెప్పారు. అయితే 2029 ఎన్నికల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. జమిలి ఎన్నికలు వస్తే శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతాయి.
2029 ఎన్నికల్లో...
ఆస్క్ కవిత పేరుతో ఎక్స్ వేదికగా నెటిజన్లతో ఆమె ఛాట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్బంగా ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు తాను 2029 ఎన్నికల్ల పోటీ చేస్తానని చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. కవిత గతంలో నిజామాద్ పార్లమెంటు స్థానంలో గెలిచారు. మరొకసారి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురి కావడంతో ఏ ఎన్నికలో పోటీ చేస్తారన్న దానిపై బీఆర్ఎస్ శ్రేణులలోనూ చర్చ జరుగుతుంది.