Bandla Ganesh : ఈయన నోరు అదుపులో పెట్టండి... లేకుంటే పార్టీకి ఇబ్బందే

పార్టీ గెలుపు కోసం పని చేసిన కాంగ్రెస్ నేతలు మామూలుగా ఉన్నారు. కానీ సినీ నిర్మాత బండ్ల గణేష్ మాత్రం రెచ్చిపోతున్నారు.

Update: 2023-12-29 12:30 GMT

film producer bandla ganesh

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ గెలుపు కోసం కృషి చేసిన నేతలు మామూలుగానే ఉన్నారు. కానీ ఏమీ లేని విస్తరాకులే ఎగిరెగిరి పడుతున్నాయన్న తరహాలో కొందరు తమదే అంతా అన్నట్లు వ్యవహరిస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీకి ఏమీ అఖండ విజయం లభించలేదు. 64 స్థానాలు మాత్రమే వచ్చాయి. అయినా ఎగిరెగిరిపడుతున్నారు కొందరు. అందులో పార్టీ కోసం ఏమీ చేయని, చేయలేని బండ్ల గణేష్ ఒకరని చెప్పక తప్పదు. అసలు ఈయన గారి కామెంట్స్ చూస్తుంటే తెలంగాణలో ఎవరికైనా కాలక మానదు.

విమర్శలు చేస్తూ....
కేసీఆర్, కేటీఆర్‌లను సయితం విమర్శించే స్థాయికి బండ్ల గణేష్ వచ్చారు. కమెడియన్ కు ఎక్కువ అని.. చెప్పుకునే ఈయన కామెంట్స్ చూసి కాంగ్రెస్ నేతలే ఈయనకెందుకు లేని పోని బాధ అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఎవరికైనా గెలుపు ఎలా పలకరిస్తుందో.... ఓటమి కూడా అదే తరహాలో భుజం తడుతుంది. ఓటమి పాలయినంత మాత్రాన ఎవరినీ తీసేయాల్సిన పనిలేదు. ఓటమికి అనేక కారణాలుంటాయని వేరే చెప్పాల్సిన పనిలేదు. అలాగే గెలుపుకు కూడా అంతే మరి.
కేటీఆర్ పై...
కానీ తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన నాటి నుంచి ఈ సినిమా హాస్య నటుడు, నిర్మాత ఒంటి మీద గుడ్డ నిలవడం లేదు. కేటీఆర్ పైన సవాల్ విసురుతున్నారు. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ తన పార్టీ కార్యాలయంలో తమ పాలనలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పుకున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ స్వేదపత్రాలను విడుదల చేశారు. దీనిపై ఆయన కామెంట్స్ చేస్తూ సార్ పవర్ పోయినోళ్లకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎందుకంటూ బండ్ల గణేష్ ప్రశ్నించారు. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలంలూ నిలదీశారు.
ఆ స్థాయి ఉందా?
అసలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు చేసే స్థాయి బండ్ల గణేష్ కు ఉందా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కామెడీ పీస్ అంటూ సెటైర్‌లు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు.. మంత్రులు విమర్శలు చేయడంలో తప్పు లేదు కానీ.. పార్టీ కోసం ఏమీ చేయని, చేయలేని బండ్ల గణేష్ గెలిచిన తర్వాత నోరు పారేసుకుని కేసీఆర్, కేటీఆర్ లపై విమర్శలు చేస్తుంటే అది కాంగ్రెస్ పార్టీకే ఫ్యూచర్ లో నష్టం చేకూరుస్తుందని, ఇప్పటికైనా ఆ బండ్లగణేష్ నోటిని అదుపులో పెట్టాలంటూ కాంగ్రెస్ అభిమానులే కోరుతున్నారు. ఐదేళ్ల తర్వాత తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఈ బండ్ల గణేష్ ఎక్కడ ఉంటాడు? అన్న ప్రశ్న కూడా సోషల్ మీడియాలో వినిపిస్తుంది.


Tags:    

Similar News