KCR : కేసీఆర్ కు నోటీసులు... జూన్ 5న హాజరు కావాలని ఆదేశం
కాళేశ్వరంలో జరిగిన అవకతవకలపై విచారించేందుకు కేసీఆర్ కు కమిషన్ నోటీసులు ఇచ్చారు
కాళేశ్వరంలో జరిగిన అవకతవకలపై విచారించేందుకు కేసీఆర్ కు కమిషన్ నోటీసులు ఇచ్చారు. కేసీఆర్ తో పాటు హరీశ్ రావు, ఈటల రాజేందర్ కు కూడా నోటీసులను జస్టిస్ పినాకీ ఘోష్ కమిషన్ నోటీసులు పంపింది. జూన్ 5న కేసీఆర్ ను, జూన్ 6న హరీశ్ రావును, జూన్ 9వ తేదీన ఈటల రాజేందర్ ను విచాణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది.
కాళేశ్వరం లో జరిగిన అవకతకవలపై
కాళేశ్వరం లో జరిగిన అవకతకవలపై జస్టిస్ పినాకీ ఘోష్ విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేసింది. జూన్ 5వ తేదీ లోపు కేసీఆర్ హాజరవ్వాలని కోరింది. ఆ సమయంలో ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా హరీశ్ రావు ఉండటంతో ఇద్దరికీ నోటీసులు జారీ చేసింది. నిన్న కాళేశ్వరం కమిషన్ గడువును పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేసింది. మరీ కమిషన్ ఎదుటకు కేసీఆర్ హాజరవుతారా? లేదా? అన్నది చూడాలి.