Telangana : రేవంత్ కు పాదాభివందనం చేసిన ఐఏఎస్ కు చీవాట్లు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాదాభివందనం చేసిన ఐఏఎస్ అధికారి శరత్ పై చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు

Update: 2025-05-21 02:07 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాదాభివందనం చేసిన ఐఏఎస్ అధికారి శరత్ పై చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజులక్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. సభలో ఐఏఎస్ అధికారి శరత్ ముఖ్యమంత్రి రేవంత్ కు పాదాభివందనం చేయడం ఐఏఎస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కేసీఆర్ కాళ్లు మొక్కిన ఐఏఎస్ లు కూడా ఉన్నారు.

ఆదేశాలు జారీ...
కాగా తాజాగా ఐఏఎస్ అధికారి శరత్ చేసిన పనికి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు నిబంధనలను ఉల్లంఘించిన ఐఏఎస్ లపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిబంధనలు ఉల్లంఘించి పాదాభివందనాలు చేస్తున్నారని, స్థాయికి తగినట్లుగా వ్యవహరించాలని, లేకుంటే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని ఆదేశాల్లో పేర్కొన్నారు.

Tags:    

Similar News