Revanth Reddy : యూరియా కొరతపై రేవంత్ రెస్సాన్స్ ఇదే

తెలంగాణలో యూరియా కొరతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల పట్ల వివక్ష చూపుతుందని అన్నారు

Update: 2025-08-19 07:29 GMT

తెలంగాణలో యూరియా కొరతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల పట్ల వివక్ష చూపుతుందని అన్నారు. పదే పదే విజ్ఞప్తులు చేసినా, లేఖలు రాసినా తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన యూరియాను కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణిని అవలంబిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు మోదీ భజన చేస్తున్నారని తెలిపారు.పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు యూరియా కొరతపై ఆందోళన చేసినా బీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనలో పాల్గొనలేదని ఆయన అన్నారు.

భయమా? భక్తా...?
తెలంగాణ ప్రజల పక్షాన నిలిచి ఆందోళనలో పాల్గొన్న ప్రియాంక గాంధీకి రేవంత్ రెడ్డి ధన్యావాదాలు తెలిపారు. రాహుల్ పై ఆగ్రహాన్ని తెలంగాణ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం చూపుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గల్లీలో లొల్లి చేయడానికి ఉత్సాహం చూపించే వారు ఢిల్లీలో బీజేపీని ప్రశ్నించేందుకు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు బీజేపీ అంటే భక్తా? భయమా? అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ఆయన కోరారు.


Tags:    

Similar News