Hyderabad : నేడు గాంధీభవన్ కు రేవంత్ రెడ్డి

నేడు గాంధీ భవన్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు

Update: 2025-12-02 01:53 GMT

నేడు గాంధీ భవన్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నేడు కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న రేవంత్ రెడ్డి, తెలంగాణ ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్ హాజరు కానున్నారు.కొత్తగా నియమితులైన డీసీసీలు, పాత డీసీసీలు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలతో సమావేశం జరగనుంది.

స్థానిక సంస్థల ఎన్నికలపై...
ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక ఎన్నికలు, విజయోత్సవ సంబరాలపై సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీసీసీ అధ్యక్షులకు టీపీసీసీ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలకు దిశానిర్దేశం చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు.కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం తర్వాత జిల్లాల పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరి వెళతారు.


Tags:    

Similar News