Telangana : నేడు అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేడు అసెంబ్లీకి రానున్నారు.

Update: 2025-09-14 03:45 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేడు అసెంబ్లీకి రానున్నారు. పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇచ్చిన గడువు ముగియడంతో నేడు అసెంబ్లీ వద్దకు చేరుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ వాదనను వినిపించే ప్రయత్నం చేయనున్నారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాదరావు నోటీసులు జారీ చేయడంతో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తమ వివరణ ఇచ్చారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు తమ వివరణ ఇవ్వాల్సి ఉంది.

తమ వాదనను వినాలని...
అయితే తమ వాదనను కూడా తీసుకోవాలని, వారు బీఆర్ఎస్ లో లేరని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిన సందర్భంగా తీసుకున్న ఫొటోలతో పాటు వివిధ ఆధారాలను కూడా సమర్పించనున్నారు. అయితే స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి నేడు బెంగళూరు పర్యటనలో ఉండటంతో అందుబాటులో ఉండరని చెబుతున్నారు. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చేయనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News