KCR : నేడు కేసీఆర్ పొలంబాట

నీరందక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరుతున్నారు.

Update: 2024-03-31 02:02 GMT

నీరందక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరుతున్నారు. ఈ కార్యక్రమానికి పొలంబాటగా నామకరణం చేశారు. ఇటీవల వర్షాలు కురియకపోవడం, పొలాలకు సాగు నీరందక అనేక పొలాలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందుుల పడుతున్నారు. రైతులకు అండగా నిల్చి వారికి భరోసా కల్పించేందుకు కేసీఆర్ నేటి నుంచి పొలంబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నల్లగొండ జిల్లా నుంచి ఈ పర్యటన ప్రారంభం కానుంది.

పర్యటన ఇలా...
ఉదయం ఎర్రవెల్లి నుంచి బయలుదేరి 10.30 గంటలకు జనగామ జిల్లా దేవరుప్పల మండలం ధరావత్ తండాకు చేరుకుంటారు. అక్కడ ఎండిన పంటపొలాలను పరిశీలిస్తారు. రైతులతో మాట్లాడతారు. అనంతరం సూ్యాపేట జిల్లా తుంగతుర్తితో పాటు అర్వపల్లి, సూర్యాపేట మండలాల్లో పంటలను పరిశీలిస్తారు. భోజన విరామం అనంతరం సాయంత్రం నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమానూరుకు వెళ్లి అక్కడ పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.


Tags:    

Similar News