బండి సంజయ్ రెండో విడత పాదయాత్ర

మార్చి 14వ తేదీ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత పాదయాత్రను కొనసాగించనున్నారు

Update: 2022-02-28 13:58 GMT

తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ నాయకత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ఏప్రిల్ 14వ తేదీ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత పాదయాత్రను కొనసాగించనున్నారు. ఇప్పటికే బండి సంజయ్ 36 రోజుల పాటు పాదయాత్ర చేసిన బండి సంజయ్ రెండో విడతలో రెండు వందల రోజుల పాటు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు.

ఈసారి 200 రోజులు....
బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే తెలంగాణలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పైన బీజేపీ విజయం సాధించింది. మరింతగా ఇతర ప్రాంతాల్లోనూ బలోపేతం చేయాలని మొత్తం ఐదు విడతలుగా పాదయాత్ర చేయాలని బండి సంజయ్ భావిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే  ఏప్రిల్  14వ తేదీన బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.


Tags:    

Similar News