నేడు మహిళ కమిషన్ ఎదుటకు బండి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు మహిళ కమిషన్ ఎదుట హాజరు కానున్నారు

Update: 2023-03-18 02:58 GMT

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు మహిళ కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను దూషించిన కేసులో రాష్ట్ర మహిళ కమిషన్ బండి సంజయ్ కు నోటీసులు జారీ చేసింది. పార్లమెంటు సమావేశాలు ఉండటంతో తాను ఈ నెల 18వ తేదీన కమిషన్ ఎదుట హాజరవుతానని బండి సంజయ్ తెలిపారు.

ఉదయం 11 గంటలకు...
అందుకు మహిళ కమిషన్ అంగీకరించింది. ఈ రోజు 11 గంటలకు మహిళ కమిషన్ ఎదుట హాజరు కావాలని లేకుంటే చర్యలు తప్పవని కమిషన్ హెచ్చరించింది. దీంతో బండి సంజయ్ లీగల్ సెల్, మహిళ న్యాయవాదులతో కలసి మహిళ కమిషన్ కార్యాలయానికి రానున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.


Tags:    

Similar News