మూర్ఖుడు ముఖ్యమంత్రిగా ఉండటానికి వీల్లేదు

ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత ద్రోహి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు

Update: 2022-02-02 07:59 GMT

ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత ద్రోహి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు. రాజ్యాంగాన్నే తిరిగి రాయాలనే మూర్ఖుడు ముఖ్యమంత్రిగా ఉండటానికి అనర్హుడు అని అన్నారు. రాజ్యాంగాన్ని తిరిగి రాయడమంటే అంబేద్కర్ ను అవమానించడమేనని అని చెప్పారు. అంబేద్కర్ జయంతి, వర్థంతి లకు కూడా కేసీఆర్ హాజరు కారన్నారు.

రేపు నిరసన దీక్షలు....
దళితుడైన రాష్ట్రపతి ప్రసంగాన్ని కూడా టీఆర్ఎస్ బహిష్కరిస్తుందని చెప్పారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి ఏం చేశావని బండి సంజయ్ ప్రశ్నించారు. దళిత బంధు ఎంతమందికి ఇచ్చావని ప్రశ్నించారు. కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా రేపు బీజేపీ నేతలు తమ పార్టీ కార్యాలయాల్లో దీక్ష చేస్తారన్నారు. రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఢిల్లీలో బండి సంజయ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఒక్క నిమిషం కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిలో ఉండటానికి అనర్హుడని అన్నారు. మూర్ఖుడిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేంత వరకూ తమ పోరాటం ఆగదని బండి సంజయ్ చెప్పారు.


Tags:    

Similar News