కేసీఆర్ జైలుకెళ్లే సమయమొచ్చింది
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అవినీతిపై కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమైందని తెలిపారు. కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటున్న విషయంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉందని బండి సంజయ్ తెలిపారు. త్వరలోనే జైలుకు కూడా కేసీఆర్ వెళతారని, ఎక్కడున్నా గుంజుకువస్తామని బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అంటూ డ్రామాలు మొదలు పెట్టారని అన్నారు.
సానుభూతి కోసం...
పశుగ్రాసం కుంభకోణంలో లాలూప్రసాద్ జైలుక వెళ్లిన విషయాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు. అందుకే తేజస్వి యాదవ్ ను నిన్న కలిశాడని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం జైలుకు పంపితే సానుభూతి కోసం ఇప్పటి నుంచే కేసీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టాడని అన్నారు.