అలాగయితే ఎలా దొరుకుతారు.. కేటీఆర్ కు బండి కౌంటర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాల్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు

Update: 2022-12-21 05:57 GMT

తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాల్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ విదేశాలకు వెళ్లినప్పడు చికిత్స చేయించుకున్నారని ఆరోపించారు. అందుకనే డ్రగ్స్ కేసులో తాను దొరకననే ధీమాతోనే ఆయన వెంట్రుకలిస్తా.. కిడ్నీ ఇస్తా.. రక్తం ఇస్తా అని సవాళ్లు విసురుతున్నాడని అన్నారు. తాము సవాల్ చేసిందెప్పుడు? కేటీఆర్ స్పందించిందెప్పుడు అని బండి సంజయ్ ప్రశ్నించారు. తాము చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని తెలిపారు.

నోరు అదుపులో....
కేటీఆర్ మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదన్నారు. ఇది నిజాం పాలన కాదని గుర్తుంచుకుంటే మంచిందని బండి సంజయ్ హితవు పలికారు. తాము సవాల్ చేసినప్పడే శాంపిల్స్ ఇచ్చి ఉంటే అసలు విషయం బయటపడి ఉండేదని బండి సంజయ్ అన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలు తరిమికొట్టే రోజులు ఎంతో దూరం లేవన్నారు. ఎవరికీ భయపడే ప్రసక్తి లేదని, నిజాలను నిర్భయంగానే చెబుతామని బండి సంజయ్ అన్నారు.


Tags:    

Similar News