కేసీఆర్ కు గుడ్ బై చెప్పై టైమొచ్చింది

తెలంగాణలో కేసీఆర్ కు గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు

Update: 2022-12-15 12:42 GMT

తెలంగాణలో కేసీఆర్ కు గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కరీంనగర్ లో బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ పాదయాత్ర ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ను ఎన్నుకుని చక్కని సందేశం ఇచ్చారన్నారు. ఎవరైనా రాష్ట్రపతిగా గిరిజన మహిళ ఎంపిక అవుతుందని ఊహించారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంపై కేసీఆర్ కు నమ్మకం లేదన్నారు. కేసీఆర్ సర్కార్ అవినీతిలో మునిగి తేలుతుందన్నారు. మోదీ హయాంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని జేపీ నడ్డా అన్నారు.

విశ్రాంతి అవసరం..
ఇక కేసీఆర్ కు రాజకీయంగా విశ్రాంతి ఇవ్వాల్సిందేనని ఆయన అన్నారు. బీజేపీకి అధికారం అవసరం అని ఆయన అన్నారు. ఉట్టికెగరలేన్నమ్మ స్వర్గానికి ఎగిరినట్లుంది కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ తన పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేసిందన్నారు. బీఆర్ఎస్ త్వరలోనే వీఆర్ఎస్ తీసుకోక తప్పదని ఆయన అన్నారు. కవితను ఎందుకు సీబీఐ విచారించిందో కేసీఆర్ చెప్పగలరా? అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని ఆయన అన్నారు. కేసీఆర్ కు కుటుంబం తప్ప మరేమీ కనిపించదని ఆయన అన్నారు. భూములను దోచుకునేందుకే ధరణి పోర్టల్ ను తీసుకువచ్చారని జేపీ నడ్డా మండి పడ్డారు.
దోచుకుతినడమే..
బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని జేపీ నడ్డా అన్నారు. డబుల్ బెడ్ రూంలు పేదలకు ఇస్తానని చెప్పి కేసీఆర్ ఫాంహౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద ఇచ్చే నిధులకు పేర్లు మార్చి పక్కదారి పట్టిస్తున్నారని జేపీ నడ్డా ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయమయిపోయిందని ఆయనఅన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకున్నారన్నారు. పేర్లు మార్చుకుని కేంద్ర పథకాలను అమలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.


Tags:    

Similar News