Telagngana : నేడు కాళేశ్వరం కమిషన్ ఎదుటకు ఈటల
కాళేశ్వరం కమిషన్ ఎదుటకు నేడు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ హాజరు కానున్నారు
కాళేశ్వరం కమిషన్ ఎదుటకు నేడు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ హాజరు కానున్నారు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇప్పటికే ఈటల రాజేందర్ కు నోటీసులు జారీ చేయడంతో ఆయన కమిషన్ ఎదుట హాజరవుతారని చెప్పారు. ఉదయం పదకొండు గంటలకు ఈటల రాజేందర్ కమిషన్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు.
అప్పటి ఆర్థిక మంత్రిగా...
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిన సమయంలో ఈటల రాజేందర్ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థికమంత్రిగా ఉన్నారు. దీంతో ఈటల రాజేందర్ నుంచి వాంగ్మూలం తీసుకునేందుకు కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఎన్ని నిధులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి మంజూరు చేశారు? ఎవరి ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేశారు? అన్న దానిపై మాత్రమే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిధుల విడుడలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్న దెవరు? అన్న కోణంలో కమిషన్ ప్రశ్నించే అవకాశముంది. ఆర్ధిక శఆఖ అనుమతులు, రుణాల అనుమతులకు సంబంధించి వివరాలను సేకరించనుంది.