Breaking : ముగిసిన ఈటల విచారణ
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు.
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. అయితే ఆయనతో కమిషన్ విచారణ ముగిసింది. కేవలం గంట సేపు మాత్రమే ఈటల రాజేందర్ ను పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన సమయంలో ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్నారు. ఆయన తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం విషయంలో తీసుకున్న నిర్ణయాలు, విడుదల చేసిన నిధులు, తీసుకున్న రుణాలకు సంబంధించిన సమాచారాన్ని కాగితాలను తీసుకుని వెళ్లారు.
వీటికి సంబంధించి...
అయితే విచారణలో ఏ ఏ ప్రశ్నలు వేశారన్నది తెలియకపోయినా ముందుగా తయారు చేసుకున్న ప్రశ్నలకు మాత్రం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సమాధానమిచ్చినట్లు తెలిసింది. ఆర్థికపరమైన అంశాల మీదనే ఈటల రాజేందర్ ను కమిషన్ ప్రశ్నించినట్లు తెలిసింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో ఏర్పాటయిన కమిషన్ ఎదుటకు 9వ తేదీన హరీశ్ రావు, 11వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. అయితే ఆర్థిక శాఖకు సంబంధించి పెద్దగా ఏమీ లేవని, అక్కడ నిర్మాణం చేపట్టడానికి ఇరిగేషన్ శాఖ మాత్రమేనని ఈటల రాజేందర్ సమాధానం చెప్పినట్లు తెలిసింది.