Raja Singh : రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని తెలిపారు. హిందువుల పండగలకు ఎందుకు ఆంక్షలు పెడుతున్నారని రాజాసింగ్ ప్రశ్నించారు. 9వ నిజాంలాగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారన్న రాజాసింగ్ హిందూ పండగలు ఎలా జరుపుకోవాలో మీరు మాకు చెబుతారా? అని ప్రశ్నించారు.
హోలీ పండగకు...
హోలీ పండగను పన్నెండు గంటల వరకే చేసుకోవాలా? అంటూ నిలదీశారు. హోలీ వేడుకలకు గుమి కూడవద్దని చెబితే ఎలా అని అన్నారు. మిగిలిన మతాల వారి పండగలకు కూడా అలాగే ఆంక్షలు విధించమని అన్నారు. హిందువులతో పెట్టుకుంటే కేసీఆర్ కు పట్టిన గతే మీకూ పడుతుందంటూ రేవంత్ రెడ్డిని రాజాసింగ్ హెచ్చరించారు.