బండిపై దాడి విషయం.. గవర్నర్ చెంతకు
బండి సంజయ్ పర్యటనల్లో దాడులకు సంబంధించి బీజేపీ నేతలు గవర్నర్ తమిళి సై దృష్టికి తీసుకెెళ్లారు.
బండి సంజయ్ పర్యటనల్లో దాడులకు సంబంధించి బీజేపీ నేతలు గవర్నర్ తమిళి సై దృష్టికి తీసుకెెళ్లారు. గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల నుంచి బండి సంజయ్ నల్లగొండ జిల్లాలో పర్యటిన్తున్నారు. వరి రైతులకు అండగా నిలిచేందుకు ఆయన పర్యటన చేస్తున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో బండి సంజయ్ పర్యటనను టీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.
వరస దాడులు...
నిన్న బండి సంజయ్ కాన్వాయ్ పై దాడి జరిగింది. కొద్ది సేపటి క్రితం చిల్లకల్లు వద్ద బండి సంజయ్ ప్రయాణిస్తున్న వాహనంపై రాళ్ల దాడి జరిగింది. బండి సంజయ్ పర్యటన సజావుగా జరిగేందుకు నల్లగొండ పోలీసులు సహకరించడం లేదని, పోలీసులు వైఫల్యం వల్లనే టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని గవర్నర్ కు ఇచ్చిన ఫిర్యాదులో బీజేపీ నేతలు పేర్కొన్నారు.