ఉద్యోగ సంఘాలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రికి ఉద్యోగ సంఘాలు ఎందుకు భయపడుతున్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు.
ముఖ్యమంత్రికి ఉద్యోగ సంఘాలు ఎందుకు భయపడుతున్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తీరుతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారన్నారు. కొందరు ఉద్యోగ సంఘాల నేతలు సీఎం మోచేతి కింద నీళ్లు తాగుతున్నారని సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. స్థానికతను ప్రామాణికంగా తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి ఎప్పుడైనా చర్చించారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.
బదిలీల విషయంలో....
ఉద్యోగల బదిలీల విషయంలో పారదర్శకత పాటించడం లేదని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ తుగ్లక్ నిర్ణయాలతో ఇబ్బంది పడుతున్నా ఎందుకు ఉద్యోగ సంఘాలు నోరు మెదపడం లేదన్నారు. కేసీఆర్ అంటే ఎందుకంత భయపడుతున్నారన్నారు. కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంపై బండి సంజయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరుద్యోగులు ఉద్యమించే రోజు ఎంతో దూరం లేదని అన్నారు.