బండి సంజయ్ విడుదల... కేంద్ర మంత్రి స్వాగతం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జైలు నుంచి విడుదలయ్యారు

Update: 2022-01-05 14:26 GMT

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జైలు నుంచి విడుదలయ్యారు. కరీంనగర్ జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న బండి సంజయ్ కొద్దిసేపటి క్రితం విడులయ్యారు. ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. బండి సంజయ్ కు కేంద్ర మంత్రి భగవత్ కుభా స్వాగతం పలికారు.

పార్టీ కార్యకర్తలు.....
బండి సంజయ్ జీవో నెంబరు 317కు వ్యతిరేకంగా జాగరణ చేస్తున్న సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని, పోలీసుల విధులకు ఆటంకం కల్పించారని కేసులు నమోదు చేశారు. కరీంనగర్ కోర్టు బండి సంజయ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఆయన బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడంతో ఊరట లభించింది. బండి సంజయ్ జైలు నుంచి విడుదలయిన సందర్భంగా పార్టీ కార్యకర్తలు పెద్దయెత్తున స్వాగతం పలికారు.


Tags:    

Similar News