KTR : కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి అవినీతి నిరోధక శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు

Update: 2025-06-13 12:10 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి అవినీతి నిరోధక శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 16వ తేదీన ఉదయం పది గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో రెండోసారి నోటీసులు జారీ చేశారు. మే 26వ తేదీనవిచారణకు రావాలని నోటీసుల్లో కోరగా, అప్పటికేముందుగా ఫిక్స్ అవ్వడంతో తాను విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత హాజరవుతానని చెప్పారు.

విచారణకు సహకరిస్తానని...
అందుకు అంగీకరించిన ఏసీబీ అధికారులు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. గతంలో ఒకసారి ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణ చేపట్టిన అధికారులు మరోసారి విచారణ చేపట్టేందుకు నోటీసులు తెలిపారు. అయితే ఈ నెల 16వ తేదీన తాను విచారణకు హాజరవుతానని, విచారణకు సహకరిస్తానని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. పాలన చేతకానప్పడు ఇతర విషయాలపై దృష్టి పెట్టడం సహజమేనని కేటీఆర్ అన్నారు.


Tags:    

Similar News