మిర్చి బజ్జీ గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి

మిర్చి బజ్జీ గొంతులో ఇరుక్కుని ఊపిరాడక వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది.

Update: 2025-08-10 01:52 GMT

మిర్చి బజ్జీ గొంతులో ఇరుక్కుని ఊపిరాడక వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం నింపింది. మిర్చి బజ్జి తింటూ గొంతులో ఇరుక్కోవడంతో ఒక వ్యక్తి మరణించాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం అయ్యవారిపల్లి గ్రామంలో జరిగిందని పోలీసులు తెలిపారు.

వేడి వేడి బజ్జీ...
గ్రామానికి చెందిన యాభై ఐదేళ్ల బాల్ రాం స్థానిక ఉండే హోటల్ వద్ద వేడివేడి మిర్చి బజ్జీలు తింటుండిగా అవి గొంతులో అడ్డుపడి ఊపిరాడక కింద పడిపోయాడు. వెంటనే పక్కన ఉన్న వారు గమనించి వెంటటనే జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


Tags:    

Similar News