జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించాల్సిందే : ఖర్గే

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

Update: 2025-07-04 11:46 GMT

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. గాంధీభవన్ లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరూ కలసి కట్టుగా పనిచేసి ఉప ఎన్నికల్లో విజయం సాధించాల్సిందేనని అన్నారు. అందుకు అవసరమైన సహాయ సహకారాలను కేంద్ర నాయకత్వం అందిస్తుందని తెలిపారు. అలాగే పార్టీకి సంబంధించిన అంశాలపై ఎవరూ బయట విమర్శలు చేయవద్దని సూచించారు. ఎవరైనా అసంతృప్తి ఉంటే నాలుగు గోడల మధ్య చర్చించుకోవాలని తెలిపారు.

పాత, కొత్త నేతలను కలుపుకుని...
పాత, కొత్త నేతలను కలుపుకుని వెళ్లాలని, ఆ బాధ్యత రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ పై ఉందని మల్లికార్జున ఖర్గే తెలిపారు. ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశాలు ఇవ్వవద్దని, ప్రభుత్వం చేసే మంచి పనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మల్లికార్జున ఖర్గే సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో జిల్లా ఇన్ ఛార్జి మంత్రులు తనకు నామినేటెడ్ పదవుల జాబితా ఇవ్వలేదని, ఫైల్ తన వద్దకు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు నిర్లక్ష్యంగా ఉండటం మంచిది కాదని రేవంత్ రెడ్డి సూచించారు.


Tags:    

Similar News