ఈటలవన్నీ అబద్ధాలేనన్న తుమ్మల

కాళేశ్వరం కమిషన్ ఎదుట బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నీ అబద్ధాలు చెప్పారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు

Update: 2025-06-07 12:28 GMT

కాళేశ్వరం కమిషన్ ఎదుట బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నీ అబద్ధాలు చెప్పారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం కమిషన్ ఎదుట తన పేరు ఎందుకు ప్రస్తావించారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈటల రాజేందర్ అనాలోచితంగా కమిషన్ ఎదుట ఈ కామెంట్స్ చేశారా? లేక మంత్రి పదవి నుంచి తప్పుకుని చాలా రోజులు అవ్వడంతో అన్నీ విషయాలు మర్చిపోయి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? అన్నది అర్థం కావడం లేదన్నరు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం...
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం వేసిన సబ్ కమిటీ కాదని, పెండింగ్ ప్రాజెక్టుల కోసమే మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నాలుగు ప్రాజెక్టు నిర్మాణాలపై నిర్ధారణ చేసి నివేదిక ఇచ్చిందని ఆయన తెలిపారు. కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి మంత్రి వర్గ సమావేశానికి ఎదుటకు ఏ అంశమూ రాలేనది మంత్రి తుమ్మల తెలిపారు. ఈటల కమిషన్ కు తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చారో తనకు అర్థం కావడం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు


Tags:    

Similar News