Telangana : రైతులకు గుడ్ న్యూస్.. ఎకరాకు ఆరువేల రూపాయలు

రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు

Update: 2025-06-14 03:00 GMT

రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని రైతులకు ఈ నెల 25వ తేదీలోగా రైతు భరోసా నిధులను జమ చేస్తామని మంత్రి ప్రకటించారు. ఎకరానికి ఆరువేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధులను జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ఎరువులు కూడా...
పంటలు వేసుకునే సమయం దగ్గరపడటంతో రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అదే సమయంలో రైతులకు అవసరమైన ఎరువులు కూడా సిద్ధంగా ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మిగిలినవి ఆగస్టు నెలలో వస్తాయన్న తుమ్మల, ఐదు వందల బోనస్ ప్రకటించిన తర్వాత తెలంగాణలో వరది ధాన్యం సాగుతో పాటు దిగుబడి కూడా పెరిగిందని చెప్పారు.


Tags:    

Similar News