వికారాబాద్ జిల్లాలో బోటు మునిగి ఇద్దరు మృతి
వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సర్బన్ పల్లి ప్రాజెక్టు వద్ద బోటు తిరగబడి ఇద్దరు మహిళలు మరణించారు
వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సర్బన్ పల్లి ప్రాజెక్టు వద్ద బోటు తిరగబడి ఇద్దరు మహిళలు మరణించారు. మరొకరు తీవ్రగాయాలపాలైఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బీహార్ కు చెందిన ఒక కుటుంబం మియాపూర్ లో నివాసముంటున్న తమ బంధువుల ఇంటికి వచ్చింది. వారితో కలసి మొత్తం మూడు కుటుంబాలు వీకెండ్ విహార యాత్రకు బయలుదేరారు.
వీకెండ్ విహారయాత్రకు వచ్చి...
వికారాబాద్ జిల్లాలోని సర్బన్ పల్లి ప్రాజెక్టు వద్ద రిసార్ట్ కు వెల్లారు. అయితే సాయంత్రం వేళ బోటింగ్ వెళ్లారు. అయితే భారీ వర్షం కారణంగా బోటు తిరగబడింది. బోటు నీట మునగడంతో రీతికా, పూనమ్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీకెండ్ లో విహార యాత్రకు వచ్చి ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది.