ఓబులాపురం మైనింగ్ కేసు.. పిటీషన్లు కొట్టివేత

ఓబులాపురం మైనింగ్ కేసులో కీలక మలుపు సంభవించింది. ఈ కేసులో కోర్టు విచారణను వేగవంతం చేసింది

Update: 2022-10-17 14:43 GMT

ఓబులాపురం మైనింగ్ కేసులో కీలక మలుపు సంభవించింది. ఈ కేసులో కోర్టు విచారణను వేగవంతం చేసింది. మైనింగ్ కేసులో డిశ్చార్జి పిటీషన్‌లను కొట్టివేస్తూ సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకుంది. అభియోగాల నమోదు పై విచారణను వచ్చే నెల 21వ తేదీకి వాయిదా వేసింది. తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జి పిటీషన్ ను కూడా సీబీఐ కోర్టు కొట్టివేసింది.

డిశ్చార్జి పిటీషన్లను...
అలాగే ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి డిశ్చార్జిపిటీషన్ తో పాటు గాలి జనార్థన్ రెడ్డి పీఏ అలీఖాన్ డిశ్చార్జ్ పిటీషన్ ను కూడా సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఈకేసులో గతంలోనే డిశ్చార్జ్ పిటీషన్ ను గాలి జనార్థన్ రెడ్డి వెనక్కు తీసుకున్నారు. ఐఏఎస్ అధికారులు కృపానందంతో పాటు రాజగోపాల్ డిశ్చార్జి పిటీషన్లను కూడా సీబీఐ కోర్టు కొట్టివేసింది.


Tags:    

Similar News