ములుగు జిల్లాలో జలపాతాల వద్ద సందడే సందడి

తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతూ ఉండగా ములుగు జిల్లా మాత్రం ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తూ ఉంది.

Update: 2025-07-23 09:15 GMT

తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతూ ఉండగా ములుగు జిల్లా మాత్రం ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తూ ఉంది. ఎందుకంటే ఈ జిల్లాలో ఏకంగా 8 జలపాతాలు ఉన్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు పర్యాటకులు ములుగులోని పలు జలపాతాల వద్దకు పోటెత్తుతూ ఉంటారు. ములుగులో 8 జలపాతాలు ఉండగా పర్యాటకులు సందర్శించడానికి ప్రభుత్వం నుంచి కేవలం బొగతకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. ఇక మిగతా జలపాతాల పేర్లు.. బామణిసరి, మాసలొద్ది, దుస్సపాటిలొద్ది, గుండం, ఏనుగుసరి, మహితాపురం, ముత్యంధార. 30 అడుగుల ఎత్తైన కొండ నుంచి నీళ్లు కిందకు దూకే బొగత జలపాతం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ జలపాతం వరంగల్‌ నుంచి 130 కిలో మీటర్ల దూరంలో ఉంది. బొగత సమీపంలోనే దుస్సపాటిలొద్ది జలపాతం ఉంది. ఇక్కడ 70 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు పడుతూ ఉంటాయి.జూలై నెల నుంచి సెప్టెంబరు వరకు ఇక్కడ పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే వారు ఫారెస్టు అధికారుల అనుమతి తీసుకోవాలి.

Tags:    

Similar News