బండి సంజయ్ పై కేసు నమోదు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై కేసు నమోదయింది. నల్గొండ జిల్లా పర్యటన నేపథ్యంలో కేసు పెట్టారు

Update: 2021-11-16 11:51 GMT

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై కేసు నమోదయింది. నల్గొండ జిల్లా పర్యటన నేపథ్యంలో కేసు పెట్టారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ అనుమతి లేకుండా జిల్లాలో పర్యటించారని ఈ కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ సభలు సమావేశాలు పర్యటనకు అనుమతి తీసుకోకుండా బండి సంజయ్ నల్గొండలో పర్యటించారని, అందుకే బండి సంజయ్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని జిల్లా ఎస్పీ రంగనాథ్ చెప్పారు.

ఎన్నికల నిబంధనలను....
ఎన్నికల కమిషన్ సభలు సమావేశాలకు అనుమతి ఇవ్వలేదని, అయినా బండి సంజయ్ పర్యటన నిర్వహించారని ఎస్పీ రంగనాధ్ చెప్పారు .ఈ పర్యటనలో టిఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. రాళ్లు రువ్వుకున్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తింది. దీంతో బండి సంజయ్ పై పోలీసుల కేసు నమోదు చేశారు.


Tags:    

Similar News