రాష్ట్రవ్యాప్తంగా వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడిన 18 టీములు

ఫైర్ సిబ్బంది, పోలీసులు, రెస్యూ టీం, డిజాస్టర్ రెస్పాన్స్ టీం ఇలా వివిధ డిపార్ట్మెంట్ లకు సంబంధించిన..

Update: 2023-07-28 08:42 GMT

గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. పలు జిల్లాలలో వరదల్లో చిక్కుకుపోయిన వారు.. వరదల్లో కొట్టుకుపోయిన వారు..వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 టీములు రంగంలోకి దిగి పలువురి ప్రాణాలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించిన తీరు ఎంతో అభినందనీయం. ఫైర్ సిబ్బంది, పోలీసులు, రెస్యూ టీం, డిజాస్టర్ రెస్పాన్స్ టీం ఇలా వివిధ డిపార్ట్మెంట్ లకు సంబంధించిన 18 టీములు రంగంలోకి దిగి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడారు. రాష్ట్రవ్యాప్తంగా వరదల్లో చిక్కుకున్న 1421 మందిని ఫైర్ డిపార్ట్మెంట్ ప్రాణాలతో కాపాడారు. భూపాలపల్లి లోని మొరంచపల్లి లో 70 మందిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పెద్దపల్లిలోని మథాని గోపాల్ పూర్ ఇసుక రీచ్ లో 17 మంది చిక్కుకుపోయారు. వీరందరూ సహాయం కోసం ఎదురు చూశారు.

రెస్క్యూ టీం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి 17 మందిని రక్షించి సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. వరంగల్ లో మేజర్ గా 857 మంది ప్రాణాలను కాపాడారు. అలాగే ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున వరద నీరు ఇళ్లల్లోకి చేరుకోవడంతో జనాలు భవనాలపైకి ఎక్కి ఆర్తనాదాలు చేశారు. ఆ 65 మందిని డిజాస్టర్ రెస్పాన్స్ టీం రెస్క్యూ చేసి కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించారు. అదేవిధంగా కరీంనగర్ లో నలుగురిని.. జగిత్యాల నిజామాబాద్ జిల్లాలో 107 మందిని.. నిర్మల్ జిల్లాలో 200 మందిని రెస్క్యూ చేసి కాపాడారు. నిర్మల్ జిల్లాలో వరదల్లో కొట్టుకుపోతుండగా ఏడుగురు వ్యక్తులను, ఐదు ఆవులను రెస్క్యూ సిబ్బంది కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ఇదిలా ఉండగా ఫైర్ సిబ్బంది.. వరదల్లో కొట్టుకుపోతున్న 28 మంది ప్రజలను కాపాడారు. అంతే కాకుండా డిజాస్టర్ రెస్పాన్స్ టీం మూగజీవుల ప్రాణాలను సైతం రెస్క్యూ చేసి కాపాడారు. ఈ విధంగా పలు జిల్లాలోని పలు ప్రాంతాలలో వరదల్లో చిక్కుకుపోయిన వారిని 18 టీములు తీవ్రంగా కృషి చేసి కాపాడగా.. వారిని ఉన్నతాధికారులు అభినందించారు.


Tags:    

Similar News