ఖమ్మంలో సీపీఎం నేత హత్య
ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. సీపీఎం నేత సామినేని రామారావును కొందరు దుండగులు హత్య చేశారు
ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. సీపీఎం నేత సామినేని రామారావును కొందరు దుండగులు హత్య చేశారు. ఖమ్మం జిల్లా పాతర్లపాడులో ఈ ఘటన జరిగింది. సీపీఎం నేత హత్యకు గురి కావడంతో ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సామినేని రామారావుపాతర్లపాడు మాజీ సర్పంచ్‌గా పనిచేశారు.
నిందితుల కోసం...
పోలీసులు హత్య చేసిన నిందితుల కోసం గాలిస్తున్నారు. రామారావుకు ఎవరితో విభేదాలున్నాయన్న దానిపై ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాకరు. సామినేని రామారావు హత్యపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించార. ఖమ్మంలో శాంతి భద్రతలపై పోలీసులను హెచ్చరించారు. దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశాలు చేశారు. ఖమ్మంలో హింసా రాజకీయాలకు తావులేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.