Telangana : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ విద్యార్థినుల మృతి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థినులు మరణించారు

Update: 2025-12-29 06:23 GMT

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థినులు మరణించారు. మృతులు ఇద్దరు మహబూబాబాద్ మండలం గార్ల గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఇద్దరు ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. కడియాల భావన, మేఘనలు ఈ ప్రమాదంలో మరణించారని ఇక్కడి వారి బంధువులకు సమాచారం అందించారు.

గార్ల గ్రామానికి చెందిన...
ఇద్దరి వయసు 24 సంవత్సరాలు మాత్రమే. అయితే ఇద్దరు విద్యార్థినులు మరణించడంతో గార్ల గ్రామంలో విషాదం అలుముకుంది. కాలిఫోర్నియాలో జరిగిన మరణించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి. ఇద్దరు విద్యార్థినులు ఒకే గ్రామానికి చెందిన వారు కావడం కారు ప్రమాదంలో మరణించడంతో విషాదచాయలు అలుముకున్నాయి. మృతదేహాలను భారత్ కు రప్పించేందుకు సహకరించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.


Tags:    

Similar News