Telangana : అసెంబ్లీలో దుమారం రేపిన కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు
తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపాయి
తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపాయి. ప్రశ్నోత్తరాల సమయంలో కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో సభలో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. ప్రశ్నోత్తరాల సమయంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ మేడిగడ్డను బాంబులు పెట్టి పేల్చారని వ్యాఖ్యానించారు. దీనిపై వెంటనే సభలో గందరగోళం చెలరేగింది
మేడిగడ్డ మాదిరిగానే...
మేడిగడ్డ మాదిరిగానే చెక్‌డ్యాంను బాంబు పెట్టి పేల్చారని, తనుగుల చెక్‌డ్యాంను బాంబు పెట్టి పేల్చేశారన్న కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ సభ్యుల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశార. బాంబులు పెట్టి పేల్చారని అనడం ఏంటి?.. రికార్డుల నుంచి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలను తొలగించాలంటూ స్పీకర్ ను కాంగ్రెస్ సభ్యులు కోరారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అసందర్భమంటూ కాంగ్రెస్ సభ్యులు నినదించారు.