ఏపీ రాజకీయాలపై జగ్గారెడ్డి ఆసక్తికర కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులను పాలకులు నట్టేట ముంచుతున్నారని అన్నారు. ప్రభుత్వాలు మారినా స్టీల్ ప్లాంట్ ముందు కార్మికుల టెంట్లు అలాగే కొనసాగుతున్నాయని జగ్గారెడ్డి మండి పడ్డారు. స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించే ప్రయత్నాలు మాత్రం ఆగడం లేదని జగ్గారెడ్డి అన్నారు.
పాలకులు మారినా...
ప్రధాని మోదీతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లకు మంచి పరిచయాలున్నాయని, అయినా సరే స్టీల్ ప్లాంట్ సమస్యలను మాత్రం పరిష్కరించడం లేదన్నారు. మోదీ వద్దకు వెళ్లి వీరెవరూ గట్టిగా అడిగే ప్రయత్నం చేయకపోవడం వల్లనే కార్మికులు ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నారని జగ్గారెడ్డి అన్నారు. గత కొద్ది రోజుల నుంచి స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళనలు చేస్తున్నా వారిని పట్టించుకోకుండా పాలకులు కేంద్రప్రభుత్వానికి వత్తాసు పలకడమేంటని ప్రశ్నించారు