Telangana : కేసీఆర్ తో రేవంత్ కరచాలనం

తెలంగాణ శాసనసభ సమావేశాల్లో తొలి రోజు ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది

Update: 2025-12-29 05:47 GMT

తెలంగాణ శాసనసభ సమావేశాల్లో తొలి రోజు ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీ ప్రారంభం అయిన వెంటనే మిగిలిన సభ్యులందరికంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభలోకి వచ్చి తన సీటులో కూర్చున్నారు. సభలోకి ప్రవేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లి ఆయనతో కరచాలనం చేశారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

జాతీయ గీతం ముగిసిన వెంటేనే....
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాికిటి ఈ్రవీహరి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబులు కూడా ఆయన వద్దకు వెళ్లి పరామర్శించారు. జాతీయ గీతాలాపన ముగిసిన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రకటించారు. దీంతో కేసీఆర్ వెళ్లిపోయారు. అనంతరం ప్రశ్నోత్తరాలను స్పీకర్ కొనసాగిస్తున్నారు. మరొకవైపు శాసనమండలి సమావేశం వచ్చేనెలకు వాయిదా పడింది.


Tags:    

Similar News