మహిళ కమిషన్ ఎదుటకు సినీ నటుడు శివాజీ

సినీ నటుడు శివాజీ తెలంగాణ మహిళ కమిషన్ ఎదుట హాజరయ్యారు

Update: 2025-12-27 07:32 GMT

సినీ నటుడు శివాజీ తెలంగాణ మహిళ కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఇటీవల శివాజీ మహిళల దుస్తులపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో మహిళ కమిషన్ శివాజీకి నోటీసులు జారీ చేసింది. అయితే శివాజీ ఆ తర్వాత తాను అన్న వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, క్షమాపణలు కోరుతున్నానని వీడియోను విడుదల చేశారు.

నోటీసులు జారీ చేయడంతో...
అయితే మహిళ కమిషన్ నోటీసులు జారీ చేయడంతో శివాజీ కొద్ది సేపటి క్రితం కార్యాలయానికి వచ్చారు. మహిళ కమిషన్ శివాజీని విచారిస్తుంది. శివాజీ స్టేట్ మెంట్ ను రికార్డు చేస్తుంది. ఇటీవల దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాజీ చేసిన వ్యాఖ్యలను అనేక మంది మహిళ నేతలు ఖండించారు. సెలబ్రిటీలు కూడా తప్పుపట్టారు.


Tags:    

Similar News