Telangana : నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా జరగనున్నాయి. అధికార, విపక్షాలు అస్త్రశస్త్రాలతో సమావేశాలకు సిద్ధమయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు శాసనసభ సమావేశానికి హాజరు కానున్నారు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షం, విపక్షం విమర్శలను తిప్పికొట్టాలని అధికార పక్షం అన్ని రకాలుగా వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది.
అస్త్ర శస్త్రాలు సిద్ధం...
ప్రధానంగా నీటిపారుదల అంశాలపై ఈ సమావేశాల్లో వాడి వేడిగా చర్చ జరగనుంది. మరొకవైపు నేడు జరిగే బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు. హిల్ట్ పాలసీతో పాటు వివిధ రకాల అంశాలను సభలో ప్రస్తావించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సవాళ్లు - ప్రతి సవాళ్లు జరిగిన నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.