కళ్యాణ చాళుక్య శిల్పాలను కాపాడుకోవాలి!

కొడంగల్ కు వెయ్యేళ్ల చరిత్ర - పురావస్తు పరిశోధకుడు డా.ఈమని శివనాగిరెడ్డి

Update: 2025-12-29 06:46 GMT

కొడంగల్: కొడంగల్ పట్టణంలోని కమాన్ ముందుగల ఎడమవైపు వీధిలో కళ్యాణ చాళుక్యుల కాలపు (సా.శ. 10వ శతాబ్ది) శిల్పాలను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈఓ, డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు. స్థానిక మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించిన సందర్భంగా, నిర్లక్ష్యంగా పడి ఉన్న నాగదేవత, వీరులు, నంది శిల్పాలను ఆయన పరిశీలించారు. సర్పాల తో పాటు, కుడి చేతిలో ఖడ్గం, ఎడమ చేతిలో డాలు, తలపై కిరీటం ధరించి, నడుము నుంచి కింద సర్పము, పైన దేవతల ఆకారాన్ని కలిగి ఉన్నా నాగదేవతలు, చేతిలో ఈటలు ధరించి పులిని చంపుతున్న తల లేని వీరుని శిల్పం, వంటిపైన గంటల పట్టెడ ధరించి, చిన్నమోపురంతో తలలేని నంది, మరో వీరుని నల్ల శాసనపు రాతిలో చెక్కిన శిల్పాలు కొడంగల్ లో వెయ్యేళ్ల నాటి నాగదేవత ఆరాధన, పెద్దపులి దాడి నుంచి గ్రామాన్ని కాపాడిన వీరుని పట్ట గల గౌరవ భావాన్ని తెలియజేస్తున్నాయని ఆయన అన్నారు. ఈ శిల్పాలు అలనాటి సంస్కృతికి చిహ్నాలు అని కొడంగల్ పట్టణానికి వెయ్యేళ్ల చరిత్ర ఉందని తెలియజేసే అన్నవాళ్లని, వీటిని భవిష్యత్ తరాలు అందించాలని ఆలయ ధర్మకర్తలు మందారం ప్రశాంత్, శ్రీనివాస్, రత్నం లక్ష్మీనారాయణకు శివ నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ స్థపతి, సమత మూర్తి రూపశిల్పి, డి.ఎన్.వి. ప్రసాద్ పాల్గొన్నారు.




 


Tags:    

Similar News