Telangana : తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్
తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి సెలవులు ప్రకటించింది. సంక్రాంతి పండగకు తెలంగాణలో వారం రోజుల పాటు సెలువులు ఇస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. జనవరి 11వ తేదీ నుంచి పదిహేనో తేదీ వరకూ ఐదు రోజులు మాత్రమే సెలవులు ఉంటాయని గత మే నెలలో ప్రభుత్వం ప్రకటించింది.
వారం రోజులు సెలవులు...
అయితే పదో తేదీన రెండో శనివారం కూడా రావడంతో జనవరి పది నుంచి పదహారో తేదీ వరకూ సెలవులను ప్రకటిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణలో విద్యాసంస్థలకు ఏడు రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. జనవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ సెలవులు ఉంటాయి. జనవరి 17న తిరిగి పాఠశాలలు ప్రారంభమవుతాయి.