Weather Report : మార్చి నెలలోనే ఎన్ని డిగ్రీల టెంపరేచర్ నమోదువుతుందో తెలుసా?
ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది
భారత వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ఏడాది వేసవి అదిరిపోతుందని తెలిపింది. గతం కంటే ఎక్కువ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతయాని చెప్పింది. మార్చి నెల నుంచి ఎండల తీవ్రత మొదలవుతుందని, ఈసారి మార్చి, ఏప్రిల్ నెలలోనే నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. నిజానికి గత సీజన్ లో పోలిస్తే వర్షాలు ఎక్కువ. తుపానులు కూడా ఎక్కువగా వచ్చాయి. అలాగే చలి తీవ్రత కూడా ఈ ఏడాది ఎక్కువగా ఉంది. అలాగే ఎండలు కూడార ఈసారి ఎక్కువగానే ఉంటాయని చెప్పింది. ఇప్పటి నుంచే ముందుగా అందరూ సిద్ధమవ్వాలని ఒకరకంగా హెచ్చరికలు జారీ చేసింది.
పొగమంచు తో...
ఆంధ్రప్రదేశ్ లో చలిగాలుల తీవ్రత పూర్తిగా తగ్గింది. అయితే పొగమంచు మాత్రం ఉదయం వేళల్లో ఇంకా ఉంది. వాహనదారులు దట్టమైన పొగమంచుతో ఇబ్బందులు పడుతున్నారు. జనవరిలో పొగమంచు ఎక్కువగా ఉండటం సహజమేనని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చలి తీవ్రత తగ్గడంతో పాటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, క్రమంగా ఇవి పెరగడమే తప్ప ఇక తగ్గవన్న అంచనాలో ఉన్నారు. అలాగే ఏజెన్సీ ఏరియాలో కొంత చలి తీవ్రత కనిపిస్తుంది. అరకు, పాడేరు, మినుములూరు, లంబసింగి వంటి ప్రాంతాల్లో మాత్రం కొంత చలిగాలుల తీవ్రత ఉదయం ఎనిమిది గంటల వరకూ కొనసాగుతుంది.
పొడి వాతావరణం...
తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. చలితీవ్రత తగ్గడంతో పాటు ఉక్కపోత మొదలయింది. ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. తెలంగాణలో గతం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ లోనూ ఉష్ణోగ్రతలు డబుల్ డిజిట్ కు చేరుకున్నాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్తు వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. ఉదయం కొంత చలిగాలులు వీస్తున్నప్పటికీ పది గంటల నుంచి ఎండల తీవ్రత మొదలయింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.