Telangana : నేడు మద్యం షాపుల టెండర్లకు ముగియనున్న గడువు
తెలంగాణలో మద్యం షాపులటెండర్ల దాఖలుకు నేటితో గడువు ముగియనుంది
తెలంగాణలో మద్యం షాపుల టెండర్ల దాఖలుకు నేటితో గడువు ముగియనుంది. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ టెండర్లను ఆహ్వానించింది. ఇప్పటి వరకూ 90 వేల దరఖాస్తులు అందాయి. భారీ స్పందన లభించింది. అయితే తెలంగాణలో బీసీ బంద్ జరగడంతో పాటు బ్యాంకులు పనిచేయకపోవడంతో ఎక్సైజ్ శాఖ మద్యం టెండర్లకు గడువు పెంచింది.
ఈ నెల 27వ తేదీన...
నేటితో టెండర్ల దాఖలకు గడువు ముగియనుంది. ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకూ దరఖాస్తులను సమర్పించే వీలుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. మద్యం దుకాణాలకు గడువు ముగియడంతో అన్ని దుకాణాలకు టెండర్ల ద్వారా ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 27వ తేదీన లాటరీ ద్వారా మద్యం షాపుల కేటాయింపు జరగనుంది.