Telangana : నేడు ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ పోరు
ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతుల పోరు ఉధృతం అయింది
ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతుల పోరు ఉధృతం అయింది. నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ముట్టడికి పిలుపు నిచ్చారు. రేపు ఆదిలాబాద్ బంద్‌కు పిలుపునిచ్చిన బీఆర్‌ఎస్ నేడు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వడంతో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో గత కొద్ది రోజులుగా సోయా రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
సోయా పంటను...
సోయా పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజుల నుంచి సోయా రైతులు ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతుగా నేడు బీఆర్ఎస్ నిలిచింది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నేడు కలెక్టరేట్ల ముట్టడికి పిలుపు నివ్వడంతో బీఆర్ఎస్ ముఖ్యనేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. కలెక్టరేట్ల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.