ఉమెన్స్ వరల్డ్ కప్ : పాక్ టార్గెట్ 245

భారత మహిళా క్రికెటర్ల మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయింది. పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేక చేతులెత్తేశారు. పటపటా వికెట్లు..

Update: 2022-03-06 05:40 GMT

ఉమెన్స్ వన్డే ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం భారత మహిళల జట్టు - పాక్ తో బరిలోకి దిగింది. న్యూజిలాండ్ లోని మౌంట్ మౌంగనూయి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ భారత మహిళా క్రికెటర్ల మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయింది. పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేక చేతులెత్తేశారు. పటపటా వికెట్లు పడిపోతుండటంతో.. క్రికెట్ అభిమానులు నిరుత్సాహపడ్డారు. ఓపెనర్ స్మృతి మంధన హాఫ్ సెంచరీతో కదం తొక్కగా.. దీప్తి 40 పరుగులతో రాణించారు.

చివరిలో ఏడో బ్యాట్స్ మెన్ గా దిగిన స్నేహ్ రాణా (53) నాటౌట్ గా నిలిచింది. పూజా వస్త్రాకర్ (67) బ్యాట్ ఝుళిపించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. పాక్ టార్గెట్ 245పరుగులు. వార్మప్ మ్యాచ్ లలో దక్షిణాఫ్రికా, విండీస్ లపై విజయాలు సాధించి ఫుల్ జోష్ లో ఉన్న మిథాలీ జట్టు.. పాక్ పై కూడా పై చేయి సాధించాలని ఆశించింది. కానీ.. పాక్ బౌలర్ల స్పీడ్ కు టీమిండియా జట్టు బోల్తా పడింది. పాక్ 245 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగింది.



Tags:    

Similar News