India vs West Indies : సెమీస్ కు వెళ్లాలంటే గెలవాల్సిందే..నేడు భారత్ - వెస్టిండీస్ పోరు
నేడు భారత్ - వెస్టిండీస్ మధ్య టీ20 ప్రపంచ కప్ కోసం పోరు జరగనుంది
నేడు భారత్ - వెస్టిండీస్ మధ్య టీ20 ప్రపంచ కప్ కోసం పోరు జరగనుంది. కోల్ కత్తా వేదికగా రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే సమెీ ఫైనల్స్ కు చేరాలంటే రెండు జట్లు ఈ మ్యాచ్ లో గెలుపు కోసం ప్రయత్నించాల్సిందే. కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ బ్యాటర్లకు స్వర్గ ధామం. భారీ పరుగులు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జింబాబ్వే పై ఆడినట్లుగానే టీం ఇండియా బ్యాటర్లు రాణించగలిగితే భారీ స్కోరు సాధ్యమవుతుంది. ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తే వారు సెమీ ఫైనల్స్ కు చేరుకుంటారు. ఇప్పటికే సౌతాఫ్రికా ఈ గ్రూప్ నుంచి సెమీ ఫైనల్స్ కు చేరుకుంది.
ఇరుజట్లు ఫుల్ ఫామ్ లో...
బారత్, వెస్టిండీస్ జట్లు గ్రూప్ దశలో మంచి పెర్ ఫార్మెన్స్ చూపాయి. సూపర్ 8 దశలో మాత్రం రెండు టీంలు దక్షిణాఫ్రికాపై ఓటమిని చవిచూశాయి. జింబాబ్వేపైన గెలిచాయి. దీంతో వర్షం పడితే మాత్రం రన్ రేటు వెస్టిండీస్ కు అనుకూలంగా ఉంది. అయితే వాతావరణ శాఖ అంచనాల మేరకు నేడువర్సంపడే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో ఇరు జట్లకు గెలుపు కీలకంగా మారనుంది. ఇరుజట్లు ఫస్ట్ బాల్ నుంచి బౌలర్లపై విరుచుకుపడే అవకాశాలున్నాయి. ప్రత్యర్థిముందుభారీ స్కోరు ఉంచగలిగితేనే ఛేదనలో వారిని కట్టడి చేసే వీలుంటుంది. లేకుంటే బౌలర్లపై వత్తిడి పెరుగుతుందని తెలుసు. అందుకే మొదట బ్యాటింగ్ చేసిన ఏ జట్టు అయినా దూకుడుగానే ఆడే అవకాశాలున్నాయి.
బ్యాటింగ్ లైనప్....
వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ కూడా బలంగా ఉంది. తొమ్మిది మంది మంచి ఫామ్ లో ఉండి బ్యాట్ ను ఝుళిపించే వారే. భారత్ లో కూడా బ్యాటర్లు జింబాబ్వే మ్యాచ్ తో ఫామ్ లోకి వచ్చినట్లే. ఓపెనర్లు ఇద్దరూ ఐదు నుంచి ఆరు ఓవర్లు నిలకడగా ఆడి మంచి షాట్లు కొట్టగలిగితే భారత్ మంచి స్కోరు చేసే అవకాశముందని క్రీడానిపుణులు కూడా అంచనా వేస్తున్నారు.అయితే భారత బ్యాటర్లు దూకుడుగా ఆడాలని బంతిపై దృష్టి పెట్టకపోతే వికెట్ సమర్పించుకోక తప్పదని కూడా హెచ్చరిస్తున్నారు. భారత్ స్వల్ప మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉందని తెలిసింది. కులదీప్ యాదవ్ కు చోటు కల్పిస్తారా? లేదా? అన్నది చివరి నమిషంలోనే తేలనుంది. కోల్ కత్తా పిచ్ స్పిన్నర్లకు అంత అనుకూలించదన్న వార్తలతో పేసర్లతో పాటు ఆల్ రౌండర్లతోనే టీంఇండియా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. మొత్తం మీద నేడు రెండుజట్లకు చావో రేవో అన్నట్లు మ్యాచ్ జరగనుంది.