India Vs England : నరాలు తెగాయి కదయ్యా... హార్ట్ బీట్ ఎంత పెరిగిందంటే?

India Vs England : నరాలు తెగాయి కదయ్యా... హార్ట్ బీట్ ఎంత పెరిగిందంటే?

Update: 2026-03-06 01:50 GMT

నరాలు తెగే ఉత్కంఠ మధ్య ముంబయిలో జరిగిన ఇండియా - ఇంగ్లండ్ మ్యాచ్ లో చివరకు భారత్ విజయం సాధించింది. ముని కాళ్ల మీద నిల్చుని చూసిన వారు చాలా మంది ఉన్నారు. సీనియర్ క్రీడాకారులైన థోని వంటి వారు కూడా చివరి రెండు మూడు ఓవర్లలో స్టేడియంలో టెన్షన్ పడటం కనిపించింది. ఎట్టకేటకు టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ పై ఇండియా విజయం సాధించి ఫైనల్స్ లోకి అడుగు పెట్టింది. భారత్ 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ఈ విజయంతో మార్చి 8న అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌తో తలపడనుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇండియా తొలుత బ్యాటింగ్ కు దిగింది.

శర్మ తప్పించి మిగిలిన అందరూ...
అయితే ఎప్పటి లాగనే ఓపెనర్ అభిషేక్ శర్మ నిరాశపర్చాడు. ఈ వరల్డ్ కప్ మొత్తం పూర్ పెర్ ఫార్మెన్స్ చూపిస్తున్నాడు.ఇక సంజూ శాంసన్ మరోసారి జట్టు గెలుపునకు కాంక్రీట్ పిల్లర్ గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది. శాంసన్ 42 బంతుల్లో 89 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశారు. అనంతరం శివమ్ దూబే 25 బంతుల్లో 43 పరుగులు, తిలక్ వర్మ 7 బంతుల్లో 21 పరుగులు చేసి స్కోరు వేగంగా పెంచారు. ఇషాన్ కిషన్ 39 పరుగులు చేసి పరవాలేదని పించాడు. సూర్యకుమార్ యాదవ్ పదకొండు పరుగులు చేసి అనవసరపు షాట్ కు ముందుకు వచ్చి స్టంపింగ్ కు గురయ్యాడు. హార్ధిక్ పాండ్యా 27 పరుగులు చేశాడు. ఇలా ఓవరాల్ గా ఇండియన్ బ్యాటర్లంతా అభిషేక్ శర్మ మినహాయించి మంచి ఫెర్ ఫార్మెన్స్ చూపారు.
లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్...
లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులే చేసింది. జేకబ్ బెతెల్ 48 బంతుల్లో 105 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశారు. రెండో ఓవర్‌లో జట్టు స్కోరు 13 పరుగులకు ఒకవికెట్ కోల్పోయినప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన ఆయన టాప్ ఆర్డర్ నుంచి పెద్దగా సహకారం లేకపోయినా ధాటిగా ఆడాడు.వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాదిన బెతెల్, కేవలం 45 బంతుల్లోనే శతకం పూర్తి చేశారు. ఇది టీ20 ప్రపంచకప్ చరిత్రలో రెండో వేగవంతమైన శతకం. చివరి ఓవర్ తొలి బంతికి పరుగెత్తే ప్రయత్నంలో రన్ అవుట్ అయ్యారు. హార్దిక్ పాండ్యా విసిరిన బంతిని శాంసన్ వికెట్లకు తగిలించారు. చివరి ఓవర్‌లో జోఫ్రా ఆర్చర్ మూడు సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చినా భారత్ ధైర్యంగా నిలబడి విజయాన్ని కైవసం చేసుకుంది.భారత్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా తొలి బంతికే హ్యారీ బ్రూక్‌ను ఔట్ చేశారు. వరుణ్ చక్రవర్తి జోస్ బట్లర్‌ను 25 పరుగుల వద్ద ఔట్ చేయగా, అక్షర్ పటేల్ టామ్ బాంటన్ వికెట్ తీశారు.ఏడు పరుగుల తేడాతో టీం ఇండియా ఉత్కంఠల మధ్య గెలిచి ఫైనల్స్ కు చేరుకుంది. టీ20 వరల్డ్ కప్ లో టీం ఇండియా నాలుగోసారి ఫైనల్స్ కు చేరింది.


Tags:    

Similar News