Sun Oct 06 2024 00:53:44 GMT+0000 (Coordinated Universal Time)
రెండు నెలలక్రితం కరిచిన పిల్లి.. ఇద్దరు మహిళలు మృతి
దళితవాడలో నివసించే రిటైర్డ్ కండక్టర్ సాలి భాగ్యారావు భార్య కమలమ్మ, ప్రైవేటు డాక్టరైన బొడ్డు బాబూరావు భార్య నాగమణిని రెండు నెలల క్రితం
మొవ్వ : రెండు నెలల క్రితం ఓ పిల్లి ఇద్దరు మహిళలను కరవగా.. వారిద్దరూ శనివారం మరణించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కృష్ణాజిల్లా మొవ్వ మండలం వేములమడలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. దళితవాడలో నివసించే రిటైర్డ్ కండక్టర్ సాలి భాగ్యారావు భార్య కమలమ్మ, ప్రైవేటు డాక్టరైన బొడ్డు బాబూరావు భార్య నాగమణిని రెండు నెలల క్రితం ఓ పిల్లి కరిచింది. ఇద్దరు ఆస్పత్రికి వెళ్లగా.. అక్కడ టీటీ ఇంజక్షన్లు ఇచ్చి వైద్యం చేశారు. కొంతకాలానికి పిల్లి కరిచిన గాయాలు మానిపోయాయి.
కానీ.. నాలుగు రోజుల క్రితం ఇద్దరిలోనూ అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దాంతో కమల మంగళగిరి ఎన్నారై ఆస్పత్రిలో, నాగమణి విజయవాడలోని కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ నాగమణి నిన్న తెల్లవారుజామున మృతి చెందగా.. కమల నిన్న ఉదయం 10 గంటల సమయంలో మరణించింది. వారిద్దరినీ కరిచిన పిల్లిని కుక్క కరిచి ఉంటుందని, దానికి రేబిస్ సోకడంతో వీరిద్దరూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. కమల, నాగమణిని కరిచిన పిల్లి ఆ తర్వాత మరణించినట్టు స్థానికులు చెప్పారు.
Next Story