T20 World Cup : నేడు ఇంగ్లండ్ - ఇండియా మ్యాచ్

. ఇండియా -ఇంగ్లండ్ మధ్య సెమీ ఫైనల్స్ నేడు జరగనుంది

Update: 2026-03-05 03:39 GMT

టీ20 వరల్డ్ కప్ లో నేడు హై ఓల్టేజీ మ్యాచ్ జరగనుంది. ఇండియా -ఇంగ్లండ్ మధ్య సెమీ ఫైనల్స్ నేడు జరగనుంది. ముంబయి వాంఖడే స్టేడియంలో రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ జట్టు ఇప్పటి వరకూ ఓటమి లేకుండానే సెమీ ఫైనల్స్ లోకి అడుగు పెట్టింది. ఇండియా దక్షిణాఫ్రికా పై సూపర్ 8 లో ఓటమి పాలయి సెమీ ఫైనల్స్ కు చేరుకుంది.

ఎవరిది గెలుపు అనేది...
అయితే నిన్న న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మ్యాచ్ చూసిన వారికి గతంలో ఉన్న గెలుపోటములకు సంబంధం లేకుండా ఫైనల్స్ కు చేరుకోవడం కనిపించడంతో ఆశలు మరింత పెరిగాయి. ఇండియా, ఇంగ్లండ్ జట్లు రెండు బలంగానే బరిలోకి దిగుతున్నాయి. పరుగులకు వేదిక అయిన ముంబయి వాఖండే స్టేడయంలో ఎవరిది పై చేయి అన్నది నేడు తేలనుంది.


Tags:    

Similar News