Abhishek Sharma : ఇంత నిర్లక్ష్యం ఆటగాడిని ఎప్పుడైనా..ఎక్కడైనా చూశారా?
టీం ఇండియాకు అభిషేక్ శర్మ తెల్ల ఏనుగులా మారాడు. ఏ
టీం ఇండియాకు అభిషేక్ శర్మ తెల్ల ఏనుగులా మారాడు. ఏదో ఇరగదీస్తాడని అనుకుంటే మిగిటిన బ్యాటర్లపై వత్తిడి తెచ్చేందుకే శర్మ బ్యాట్ ను పట్టుకుని వచ్చినట్లు కనిపిస్తుంది. ఒకటి కాదు... రెండు కాదు.. అన్ని మ్యాచ్ లో వైఫల్యాలేనా? ఒకటి రెండు మ్యాచ్ లో వైఫల్యం అంటే పొరపాటు అనుకోవచ్చు. కానీ ఇన్నిమ్యాచ్ లలో వైఫల్యం అంటే ఖచ్చితంగా పొరపాటు కాదు.. అతి నిర్లక్ష్యం. ఈ వరల్డ్ కప్ లో అత్యంత పేలవమైన ప్రదర్శన ఎవరైనా చేశారంటే అభిషేక్ శర్మ తప్ప మరెవరూ కాదు. ఇన్నిసార్లు విఫలమయినా ఇంకా జట్టులో కొనసాగించడం అవసరమా? అన్న చర్చనెట్టింట జోరుగా నడుస్తుంది. టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంగ్లండ్‌తో ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా జరుగుతున్న సెమీఫైనల్లో అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశపర్చాడు. ఏడు బంతుల్లో 9 పరుగులే చేసి మరోసారి నిర్లక్ష్యపు షాట్‌కే వెనుదిరిగాడు. ఇంగ్లండ్ పార్ట్‌టైమ్ స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్‌లో ఔటై ఆఫ్ స్పిన్నర్ బలహీనతను బయటపెట్టుకున్నాడు.