T20 World Cup : గెలిచి నిలిచిన టీం ఇండియా.. సెమీ ఫైనల్స్ కు దూసుకెళ్లిన భారత్

. భారత్ వెస్టిండీస్ ను ఓడించి సెమీ ఫైనల్స్ కు చేరుకుంది

Update: 2026-03-02 02:00 GMT

ఒక అద్భుతమైన మ్యాచ్ ను చూసేందుకు క్రికెట్ ఫ్యాన్స్ కు ఆదివారం కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ వేదికగా మారింది. భారత్ వెస్టిండీస్ ను ఓడించి సెమీ ఫైనల్స్ కు చేరుకుంది. ఉత్కంఠ భరితమైన మ్యాచ్ ను కుర్చీలో నుంచి లేవకుండా ప్రతి ఒక్కరూ వీక్షించారు. ఆదివారం రాత్రి జరిగిన టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో భారత్‌ను సెమీఫైనల్‌కు చేరింది. 195 పరుగుల లక్ష్యం ముందు వెస్టిండీస్‌ బలంగా కనిపించినా, ఓపెనర్‌ శాంసన్ అజేయ 97తో మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. ఈ విజయంతో భారత్ చివరి నాలుగులోకి చేరింది. గురువారం ముంబయిలో ఇంగ్లండ్‌తో సెమీఫైనల్‌ ఆడనుంది.50 బంతుల్లో 97 పరుగులు చేసిన శాంసన్ ఇన్నింగ్స్‌లో 12 బౌండరీలు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.

బలమైన వికెట్లు కోల్పోయినా...
సెంచరీ మిస్‌ అయినా, అతని ఇన్నింగ్స్‌ విలువ మాత్రం అంతకంటే ఎక్కువైంది. ఆరంభంలో వికెట్లు పడినా, శాంసన్ నింపాదిగా ఆడాడు. జట్టును నిలబెట్టాడు.మూడో వికెట్‌కు సూర్యకుమార్ యాదవ్‌ పద్దెనిమిది పరుగులతో కలిసి 58 పరుగులు జోడించాడు. అప్పటికి భారత్‌ 41పరుగుతకు రెండు వికెట్లు కోల్పోయి బ్బందుల్లో పడింది. ఆ తర్వాత తిలక్ వర్మ 27తో నాలుగో వికెట్‌కు 42 పరుగులు చేశాడు.తిలక్ వర్మ పరవాలేదనిపించినా హెట్ మేయర్ అద్భుతమైన క్యాచ్ తో వెనుదిరగాల్సి వచ్చింది. తిలక్ వర్మ ఇన్నింగ్స్‌కు స్థిరత్వం వచ్చింది. హార్దిక్ పాండ్యా పదిహేడు పరుగులతోతో ఐదో వికెట్‌కు 38 పరుగులు జత చేశాడు. చివరి ఓవర్‌లో సిక్స్‌, ఫోర్‌తో ఐదు వికెట్ల తేడాతో విజయం ఖరారు చేశాడు. ఈ క్యాచ్ ను కూడా హెట్ మేయర్ పట్టాడు
వెస్టిండీస్‌కు బలమైన ఆరంభం....
టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నాలుగు వికెట్లకు 195 పరుగులు చేసింది. భారత ఫీల్డింగ్‌ నిరాశపరిచింది. మూడు క్యాచులు వదిలేసింది. 11 ఎక్స్‌ట్రాలు ఇచ్చింది. అందులో 10 వైడ్ బాల్స్ ఉన్నాయి. ఓపెనర్లు షాయ్ హోప్‌, రోస్టన్ చేజ్‌ తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించారు. పవర్‌ప్లే ముగిసే సమయానికి వికెట్‌ నష్టం లేకుండా 45 పరుగులు చేశారు. హోప్‌ 33 బంతుల్లో 32 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఐదో ఓవర్‌లో అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో చేజ్‌కు వచ్చిన సులభ క్యాచ్‌ను అభిషేక్ శర్మ వదిలేశాడు. అప్పుడు అతను 14 పరుగుల వద్ద ఉన్నాడు. తర్వాత అర్ధశతకం దరిదాపుల్లోకి చేరాడు. 25 బంతుల్లో 45 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో సూర్యకుమార్ క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. ఐదు బౌండరీలు, ఒక సిక్స్‌ అతని ఇన్నింగ్స్‌లో ఉన్నాయి.మధ్యలో షిమ్రోన్ హెట్‌మైర్‌ 12 బంతుల్లో 27 పరుగులు చేసి మ్యాచ్‌కు ఊపు తెచ్చాడు. ఒక ఫోర్‌, రెండు సిక్సర్లు కొట్టాడు.
చివరి ఓవర్లలో...
చివర్లో రోవ్‌మన్ పావెల్‌, జేసన్ హోల్డర్‌ అజేయంగా 76 పరుగులు జోడించారు. చివరి ఐదు ఓవర్లలోనే 70 పరుగులు రాబట్టారు. 16వ ఓవర్‌లో అర్ష్‌దీప్‌ బౌలింగ్‌ ఖరీదైంది. ఆ ఓవర్‌లో 24 పరుగులు వచ్చాయి. పావెల్‌ అతనిపై రెండు సిక్సర్లు, ఒక బౌండరీ బాదాడు. నంబర్‌ 5గా వచ్చిన పావెల్‌ 19 బంతుల్లో 34 పరుగులు చేశాడు. మూడు బౌండరీలు, రెండు సిక్సర్లు ఉన్నాయి. హోల్డర్‌ 22 బంతుల్లో 37 పరుగులు సాధించాడు. రెండు బౌండరీలు, మూడు సిక్సర్లు కొట్టాడు. దీంతో వెస్టిండీస్‌ భారీ స్కోరు సాధించింది. . భారత్‌ ఐదు వికెట్ల తేడాతో గెలిచి సెమీఫైనల్‌కు చేరింది. మరో మూడు బంతులుండగానే భారత్ ను సెమీ ఫైనల్ లోకి సగర్వంగా దూసుకెళ్లింది. ఈ నెల 4వ తేదీన భారత్ ఇంగ్లండ్ తో ముంబయి వేదికగా సెమీ ఫైనల్స్ లో తలపడనుంది.


Tags:    

Similar News