విజయ సాయి రెడ్డికి షాకిచ్చిన వైసీపీ అధిష్టానం

ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న విజయసాయిరెడ్డిని ఆ పదవి నుంచి తప్పించారు. పార్టీ అనుబంధ విభాగాల బాధ్యత..

Update: 2022-04-20 05:02 GMT

విజయవాడ : వైసీపీలో పదవుల పంపకాలు పూర్తయిన సంగతి తెలిసిందే. 11మందికి పార్టీ ప్రాంతీయ సమన్వయ బాధ్యతలు అప్పగించగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని 28 జిల్లాలకూ కొత్త అధ్యక్షులను నియమించారు. అయితే విజయసాయి రెడ్డికి ఊహించని షాక్ తగిలిందని అంటున్నారు. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర పార్టీ సమన్వయకర్తగా అధికారికంగా, అనధికారికాకంగా అన్నీ తానై చూసుకున్నారు విజయసాయి రెడ్డి. ఆయన వ్యాఖ్యలు, తీరుపై ఎంపీలు, ఎమ్మెల్యేలు కొందరిలో అసంతృప్తి కొనసాగుతోందనే టాక్ నడిచింది. ఈ క్రమంలో సాయిరెడ్డిని ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలనుంచి తప్పిస్తారని చర్చ సాగగా.. మంగళవారం ఆయన్ను ఉత్తరాంధ్ర బాధ్యతలనుంచి తప్పించారు.

ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న విజయసాయిరెడ్డిని ఆ పదవి నుంచి తప్పించారు. పార్టీ అనుబంధ విభాగాల బాధ్యత ఆయనకు అప్పగించారు. పార్టీలో కీలక పదవులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కడప మేయర్ కె.సురేష్ బాబు, విజయనగరం జడ్పీ చైర్మన్ చిన్న శ్రీనులకు దక్కాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నాలుగు జిల్లాలు, వాటి పరిధిలోని 27 నియోజకవర్గాల బాధ్యతలని ఇచ్చారు. ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డికి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పరిధిలోని 5 జిల్లాలు, వీటి పరిధి 35 నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. తండ్రీకొడుకులకు మొత్తంగా జిల్లాలు, వాటి పరిధిలోని 62 నియోజకవర్గాల బాధ్యతలను ఇచ్చారు. అధికార పార్టీలో ముఖ్యమంత్రి జగన్ తర్వాత కీలకంగా వ్యవహరిస్తోంది ఎంపీ విజయసాయి రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలే.. ఇప్పుడు పదవుల పంపకాల్లో ఆ ముగ్గురిలో సజ్జలకు బాధ్యతలు పెరిగాయి.


Tags:    

Similar News